VIDEO: ఘనంగా మారెమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు
కోనసీమ: కొత్తపేట(మం) వాడపాలెంలో ఉన్న మారెమ్మ అమ్మవారి తీర్థ, జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్థానిక ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.