VIDEO: రిక్షాలో మృతదేహం తరలింపు

NLR: కలిగిరిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం మానవత్వాన్ని మరిచి వ్యవహరించిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్ రాకముందే మృతదేహాన్ని రిక్షాలో ప్రభుత్వాసుపత్రికి తరలించడం అందర్నీ కలచివేసింది. ఈ దృశ్యాలను చిత్రీకరించిన మీడియా ప్రతినిధులపై సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఈ అమానుష ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.