'పెట్రోల్ బంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

SRCL: దివ్యాంగుల పెట్రోల్ బంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బై పాస్ రోడ్‌లో ఉన్న డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఫిల్లింగ్ స్టేషన్‌ను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న దివ్యాంగులతో మాట్లాడి, వారికి ఎదురవుతున్న సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు.