జగన్నాధపురంలో పర్యటించిన కలెక్టర్ బాలాజీ
ELR: ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి జిల్లాలోని అన్ని చెరువులను నింపుకొని రైతులకు భరోసా కల్పించడమే 'జల ధారా-నీటి భద్రత' కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ డీ.కే. బాలాజి అన్నారు. బుధవారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం జగన్నాధపురం రెవిన్యూ గ్రామం బాణంపేటలోని చెరువు పక్కన రైతు పర్వతనేని బాబ్జి సొంతంగా నిర్మించుకున్న ఇంజక్షన్ బావులను పరిశీలించారు.