VIDEO: పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉధృతి.. కోతకు గురైన నర్సరీ

MLG: రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది ఉధృతి పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద పెరిగి, కరకట్ట కోతకు గురవుతోంది. ఈ ప్రాంతంలో NREGS పథకం కింద ఏర్పాటైన నర్సరీ స్థలం పూర్తిగా కోతకు గురైంది. ప్రతి ఏటా మొక్కలు నాటే కార్యక్రమం జరిగినప్పటికీ, ఈసారి వరుస వరదలతో నర్సరీ ధ్వంసమైనట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.