'ఎప్పటికప్పుడు చిన్నారులకు టీకాలు ఇవ్వాలి'
KMR: క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు చిన్నారులకు టీకాలు ఇప్పించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని హెల్త్ సూపర్వైజర్ సుభాషిణి తెలిపారు. ఎర్ర పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనీ బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలకు ఇస్తున్న టీకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.