'చదువుకు పేదరికం అడ్డు కాదు'
NZB: ఆర్మూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పేద విద్యార్థినికి ఉచితంగా సైకిల్ అందజేశారు. చదువుకు పేదరికం అడ్డు కాదని, శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థినికి సూచించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాజు, సెక్రటరీ శ్రీనివాస్, కోశాధికారి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.