శ్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ శక్తి పథకాన్ని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారని అందులో భాగంగానే నేడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు.