'పాపాగ్ని నది నీటి తరలింపు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే'

KDP: వీరుపునాయనిపల్లి మండలం పరిధిలో జీఎన్ఎస్ఎస్ కాల్వ నుండి పాపాగ్ని నదిలోకి నీరు తెచ్చే పనులను ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు తాగునీరు పుష్కలంగా అందించడంతో పాటు చెరువులను నింపి రైతుల పంట పొలాలకు నీరందుతుందన్నారు.