VIDEO: భీమసింగిలో భజన కార్యక్రమం

VZM: జామి మండలంలోని భీమసింగి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ దుర్గాదేవి ఆలయంలో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో సుమారు 500మంది భవానీలతో పాటు భక్తులు భజన కార్యక్రమం నిర్వహించారు. శనివారం రాత్రి అమ్మవారి నిమర్జనం కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ ప్రాంగణ అంతా విద్యుత్ కాంతులతో అలంకరించారు.