నేడు సామూహిక వరలక్ష్మి వ్రతం

SRPT: మట్టపల్లి మహా క్షేత్రంలో చివరి శ్రావణ శుక్రవారం ఉదయం 9 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నట్లు, ఆలయ ధర్మకర్తలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్రతానికి కావాల్సిన సామాగ్రిని దేవస్థానం వారే ఉచితంగా అందిస్తారని పేర్కొన్నారు. వ్రతంలో పాల్గొనే భక్తులు ముందుగానే ఆలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.