కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

GDWL: మహారాష్ట్రలోని శక్తిపీఠం అయినా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని, బనశంకరి అమ్మవారిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో గద్వాల నియోజకవర్గంలోని రైతాంగానికి సకాలంలో వర్షాలు పడి రైతులకు మంచి జరగాలని కోరారన్నారు.