అర్జీలను నాణ్యతగా పరిష్కరించండి

KRNL: ఆదోనిలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు డివిజన్‌లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులకు సమస్యలను తెలియజేస్తూ.. గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.