ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలవుతాయా?: YCP

ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలవుతాయా?: YCP

AP: డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే Dy.CM పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ మండిపడింది. పెద్దిరెడ్డి కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారంలో ఉంది మీరే కదా ఆధారాలు చూపండి అని డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారని ఎద్దేవా చేసింది. ఎంత ప్రచారం చేసినా అబద్ధాలు నిజాలవుతాయా? అని ప్రశ్నించింది.