ఐదున్నరేళ్లలో రూ.6.15 లక్షల కోట్ల లోన్లు రైటాఫ్‌

ఐదున్నరేళ్లలో రూ.6.15 లక్షల కోట్ల లోన్లు రైటాఫ్‌

గత ఐదున్నరేళ్లలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రూ.6.15 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఆయా బ్యాంకుల ఆర్థిక పనితీరు గణనీయంగా మెరుగుపడినట్లు తెలిపింది. 2022-23 నుంచి PSBల్లో ప్రభుత్వం ఎలాంటి మూలధనాన్ని చొప్పించటం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మూలధన అవసరాల కోసం PSBలు వివిధ మార్గాల ద్వారా మూడేళ్లలో రూ.1.79 లక్షల కోట్లను సమీకరించినట్లు చెప్పింది.