ఘనంగా గ్రామ దేవతలకు బోనాలు

SRPT: పెన్ పహాడ్ మండలం అనాజిపురంలో ఆదివారం ముత్యాలమ్మ బోనాల పండుగను గ్రామస్థులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మహిళలు బోనం ఎత్తుకొని, డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా ముత్యాలమ్మ గుడికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని వేడుకున్నారు