VIDEO: కారు బైక్ ఢీ... నిండు గర్భిణికి తీవ్ర గాయలు

WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకే తండాకు చెందిన దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. తండాకు చెందిన నునావత్ మహేందర్ సరిత దంపతులు బైక్ పైన చంద్రుతండా వైపు వెళుతుండగా కారు యూటర్న్ తీసుకుంటూ బైక్‌ను ఢీ కొట్టింది. సరిత ఎనిమిది నెలల గర్భిణీ ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో108లో ఎంజీఎంకు తరలించారు.