పోలీస్ PGRSకు 60 ఫిర్యాదులు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRSకు ప్రజలు 60 ఫిర్యాదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ తుహీన్ సిన్హా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 26 కుటుంబ తగాదాలు, మూడు కుటుంబ కలహాలు, రెండు మోసానికి సంబంధించిన ఫిర్యాదులు, ఇతర విభాగాలకు చెందినవి 29 ఫిర్యాదులు అందాయన్నారు.