IVRS–PGRS అవగాహన సదస్సు

IVRS–PGRS అవగాహన సదస్సు

ASR: పెదకోట, పినకోట పంచాయతీలలో ప్రజా సమస్యల పరిష్కారాని కై తహసీల్దార్ వీరభద్ర చారి ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. IVRS కాల్స్ ద్వారా వచ్చే ప్రభుత్వ సమాచారంపై గ్రామస్తులకు వివరించారు. సివిల్ సప్లై, గ్యాస్, రెవెన్యూ సేవలకు సంబంధించిన కాల్స్‌కు స్పందించాలని సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమంలో ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవాలన్నారు.