మేయర్ ఆరోపణలపై కోటంరెడ్డి స్పందన

మేయర్ ఆరోపణలపై కోటంరెడ్డి స్పందన

AP: ఇబ్బంది పెడుతున్నారంటూ నెల్లూరు మేయర్ స్రవంతి చేసిన ఆరోపణలపై కూటమి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సున్నితంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, మేయర్ వ్యాఖ్యలపై సమయం వచ్చినప్పుడు తప్పక మాట్లాడతానని తెలిపారు. తాను ఇప్పుడు మాట్లాడితే చాలా నోర్లు మూతపడతాయని పేర్కొన్నారు.