VIDEO: తడ్కల్‌లో కార్మికులకు బట్టలు పంపిణీ

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. లైన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు వెంకట్ రావు, సభ్యులు ముదసిర్, నాయకులు పెద్ద మల్లారెడ్డి చేతుల మీదుగా దసరా కానుకగా బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పేదల కోసం లైన్స్ క్లబ్ అనేక సేవలు అందిస్తోందని తెలిపారు.