VIDEO: 'గడువు దాటిన పాలు అమ్మితే చర్యలు’

VIDEO: 'గడువు దాటిన పాలు అమ్మితే చర్యలు’

గడువు దాటిన పాల ప్యాకెట్లను, పాల పదార్థాలను కొనుగోలు చేయవద్దని అరకులోయ పశు వైద్యాధికారి డా. శీనయ్య తెలిపారు. సోమవారం మండలంలో పలు దుకాణాల్లో తనిఖీలు చేసి, నాణ్యతా ప్రమాణాలు పరిశీలించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. గడువు దాటిన పాలు, పాల పదార్థాలను అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.