ఇందిరమ్మ ఇంటిపై సీఎం ఫోటో
VKB: బొంరాస్‌పేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన నందిగామ లక్ష్మీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో నిర్మాణం పూర్తయింది. ఇందిరమ్మ ఇంటిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటో వేసి తమ అభిమానాన్ని చాటుకుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో పలు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.