జిల్లా పారిశ్రామిక పార్కును సందర్శించిన కలెక్టర్
సత్యసాయి: జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఇవాళ సోమందేపల్లి మండలం గుడిపల్లిలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కును సందర్శించారు. అనంతరం టెక్స్‌టైల్, గార్మెంట్స్ పరిశ్రమలకు చెందిన ఎస్‌ఎల్‌ఏపీ యూనిట్‌ను ఆయన పరిశీలించారు. ప్లాంట్ హెడ్ ఏ. వెంకటేషన్ కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికి, ప్లాంట్ ఏర్పాటు, ఉత్పత్తి సామర్థ్యం తదితర అంశాలను వివరించినట్లు తెలిపారు.