VIDEO: చైన్ స్నాచింగ్.. కేసు నమోదు చేసిన పోలీసులు..!
JGL: అరవింద్ నగర్లో బుధవారం రాత్రి చైన్ స్నాచింగ్ సంఘటన చోటుచేసుకుంది. సాయంత్రం సమయంలో ఓ బుల్లెట్ వాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు గట్ల శైలజ అనే మహిళ మెడలోంచి 2 తు. మంగళ సూత్రం ఎత్తుకెళ్లినట్లు వారు తెలిపారు. ఊరికి వెళ్లి తన ఇంటికీ వెళుతున్న మహిళ, ఆమె కూతురును ఆపి బంగారం చోరీ చేసినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.