అరటి పంటను పరిశీలించిన ఎంపీ

అరటి పంటను పరిశీలించిన ఎంపీ

కడప: పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామ సమీపంలో ఉన్న అరటి పంటను ఆదివారం ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అరటి రైతులతో పంట సాగుకు ఎంత మేర ఖర్చు చేశారు, అరటి ధరలు ఎలా ఉన్నాయి, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అరటి ధరలు తగ్గిన నేపథ్యంలో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అరటి పంటను పరిశీలించారు.