తర్నికల్ తండాలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

NGKL: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ తండాలో శుక్రవారం ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ. 1.50 లక్షలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గిరిజన ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే తమ లక్ష్యమని అన్నారు.