ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ప్రవీణ్ భాను

WG: పాలకొల్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా రేపాక ప్రవీణ్ భాను ఎన్నికయ్యారు. మొత్తం 1075 మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. ప్రవీణ్ భానుకు 405 ఓట్ల మెజారిటీ వచ్చిందని ఎన్నికల అధికారి బాపిరాజు తెలిపారు. అనంతరం ఆయన మంత్రి నిమ్మల రామానాయుడును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సహాయ అధికారి శ్రీరాములు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.