ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి: ఎస్పీ

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి: ఎస్పీ

VKB: ప్రజలకు పోలీసు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కే. నారాయణరెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.