రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి.. సీఎంకు ఆహ్వానం
TG: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన వివాహానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. కాబోయే భార్య హరిణ్యతో కలిసి సీఎంను కలిసిన రాహుల్, తన వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 27న రాహుల్, హరిణ్యల వివాహం జరగనుంది. 'నాటు నాటు' పాటతో రాహుల్ సిప్లిగంజ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.