టమాట రైతు ‘పంట' పండింది

KMRD: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్‌లో టమాట రైతు పంట పడింది. గ్రామానికి చెందిన స్వరూప భూంరెడ్డి దంపతులు ఎకరం భూమిలో రెండు నెలల మల్చింగ్ పద్ధతిలో టమాట సాగు చేశారు. ప్రతి రోజు టమాటలను తెంపి 30కి పైగా బాక్సుల్లో కామారెడ్డి, HYDకు తరలిస్తున్నామని, ప్రస్తుతం కిలో టమాటా రూ.70 నుంచి రూ. 100 వరకు పలకడంతో..రూ. 10 లక్షల లాభం ఉందని సదరు రైతు తెలిపారు.