బాధితుడికి ఫోన్‌ అందజేసిన ఎస్సై

బాధితుడికి ఫోన్‌ అందజేసిన ఎస్సై

ప్రకాశం: కంభం మండలంలో ఏప్రిల్ నెలలో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడికి ఎస్సై నరసింహారావు బుధవారం తిరిగి ఫోన్‌ను అందజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ కోర్ డిపార్ట్మెంట్ సహాయంతో పోయిన మొబైల్ ఫోన్‌ను గుర్తించి తిరిగి అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. ఫోన్ అందుకున్న బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.