పట్టణంలో విజృంభిస్తున్న జ్వరాలు

W.G: భారీ వర్షాల కారణంగా భీమవరం, ఉండి, పాలకోడేరుల్లో గత కొన్ని రోజుల నుంచి జ్వరాలు పెరుగుతున్నాయి. పట్టణ ప్రజలు కీళ్ల నొప్పులు, జ్వరం, గొంతునొప్పి, జలుబుతో ఇబ్బందులు పడుతున్నారు. భీమవరం ఆసుపత్రిలో రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం ఆసుపత్రుల్లో వారం రోజులుగా జ్వరాలతో బాధపడే వారి సంఖ్య పెరిగిందని వైద్యులు తెలిపారు.