విద్యార్థినులను అభినందించిన ఎమ్మెల్యే

MBNR: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను ఆయన అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.