కూతురి పేరుతో ఫేక్ అకౌంట్.. తండ్రికి అశ్లీల వీడియోలు..!
HYD: నగరంలో రోజురోజుకీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో మేడిపల్లి పీఎస్ పరిధిలోని కాచవానిసింగారంకి చెందిన ఓ వ్యక్తి కుమార్తె పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించారు. అతనికి తన కుమార్తె అశ్లీల చిత్రాలు, సందేశాలు పంపుతూ వేధింపులకు దిగారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.