అక్రమ నిర్మాణాల కూల్చివేత
RR: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్ కాలనీలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, హుడా అధికారులు సోమవారం కూల్చివేశారు. సర్వే నంబర్-100లోని ఈ కాలనీలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు నిబంధనలు ఉన్నప్పటికీ, కొందరు రెండు షెడ్లను నిర్మించారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు, హుడా అధికారుల సమక్షంలో జేసీబీ సాయంతో ఆ షెడ్లను కూల్చివేశారు.