గుప్త నిధుల కోసం తవ్వకాలు

MHBD: తొర్రూరు మండలం మాటేడు గ్రామంలోని పురాతన శివాలయంలో శుక్రవారం రాత్రి గుప్త నిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. శివాలయంలోని నంది విగ్రహం వెనుక నుంచి సొరంగం తవ్వినట్టు గ్రామస్థులు తెలిపారు. తవ్వకాలు జరిపిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.