జైలు, సఖి కేంద్రాన్ని సందర్శించిన మహిళా కమిషన్ మెంబర్

KNR: శక్తి సదన్, సఖి, కారాగారాలను సందర్శించాలన్న జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు కరీంనగర్‌లోని జిల్లా కారాగారాన్ని, సఖి కేంద్రాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతి రావు బుధవారం సందర్శించారు. జిల్లా జైలులో మహిళా ఖైదీలతో మాట్లాడి వారికి ఏర్పాటు చేసిన సదుపాయాలు, అందిస్తున్న ఆహారం, వైద్య సేవలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.