తల్లిని గెలిపించాలని తనయుడి ప్రచారం

అనకాపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తన తల్లి వంగలపూడి అనిత ను గెలిపించాలని తనయుడు నిఖిల్ ప్రచారం చేశారు. సోమవారం సాయంత్రం బంగారమ్మపేట గ్రామంలో ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ, తన తల్లి అనితమ్మను ఈ ఎన్నికల్లో అత్యధిక మోజార్టి తో గెలిపించాలని పేర్కొన్నారు.