కజ్జికాయల కోసం గొడవ.. 'డయల్ 100'కు ఫోన్

కజ్జికాయల కోసం గొడవ.. 'డయల్ 100'కు ఫోన్

ATP: ఉరవకొండలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్తారింటికి వచ్చిన అల్లుడు కజ్జికాయల కోసం గొడవకు దిగాడు. ఇద్దరు పెద్ద అల్లుళ్లకు పిండివంటలు పెట్టి, తనను చిన్నచూపు చూశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పరిస్థితి అదుపు తప్పడంతో అత్త వెంటనే 'డయల్ 100'కు ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ అసలు విషయం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు.