రాజీనామా చేసిన డోర్నకల్ బీఆర్ఎస్ నేతలు

మహబూబాబాద్: పార్లమెంట్ స్థానంలో అన్ని వర్గాల మద్దతు కోరుతు విజయం కోసం పరిగెడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ మరో ముందడుగు వేశారు. శుక్రవారం డోర్నకల్ నియోజకవర్గంలో వరుసగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీకు మూకుమ్మడి రాజీనామా చేసిన వారందరు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో సమావేశమవ్వగా వారిని బలరాం నాయక్ కలిసి తనకు మద్దతివ్వాలని కోరారు.