VIDEO: వేట్లపాలెం ఘటన.. అధికారులపై కూడా కేసులు పెట్టాలి
KKD: వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో జరిగిన భారీ ప్రమాదం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. కేవలం 15 కేజీలకే అనుమతి ఉన్నచోట, 15 టన్నుల ముడి సరుకుతో నిబంధనలకు విరుద్ధంగా తయారీ సాగుతున్నా తనిఖీలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విధి నిర్వహణలో విఫలమైన అధికారులపై కూడా కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.