బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఏపీ మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని ప్రకటించారు. మరో వైపు ప్రధాని మోదీ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.