యువతుల కోసం ఓ వీడియోను షేర్ చేసిన సీపీ సజ్జనార్
HYD: స్మార్ట్ఫోన్ ఇప్పుడు ఎంతోమంది యువతుల పాలిట శాపంగా మారుతోందని సీపీ సజ్జనార్ అన్నారు. సోషల్ మీడియాలో అపరిచితులతో ఏర్పడే పరిచయాలు ఊహించని ప్రమాదాలకు దారితీస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ఒక అవేర్నెస్ వీడియోను షేర్ చేస్తూ, యువతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ వలల్లో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.