మమతా ప్రభుత్వంపై మోదీ మండిపాటు
బెంగాల్ సీఎం మమతా ప్రభుత్వంపై PM మోదీ మండిపడ్డారు. రాష్ట్రపతి ముర్ము పర్యటనలో ప్రోటోకాల్ పాటించకపోవడం, గిరిజన సదస్సు వేదికను మార్చడంపై ధ్వజమెత్తారు. రాష్ట్రపతి పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత అవమానకరమన్నారు. ప్రజాస్వామ్యాన్ని, గిరిజన సాధికారతను నమ్మే ప్రతి ఒక్కరూ ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ముర్ము ఆవేదన భారతీయులందరినీ కలిచివేసిందని తెలిపారు.