కమిషనర్ తీరుతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు
NLR: బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ వార్డు సమస్యలపై సహకరించడం లేదని బీజేపీ నాయకులు గంజం పెంచల ప్రసాద్ ఆరోపించారు. వార్డులలో జరిగే ప్రతీ కార్యక్రమానికి కమిషనర్ తప్పకుండా హాజరయ్యే విధంగా చూడాలని తెలిపారు. కమిషనర్ ప్రవర్తిస్తున్న తీరు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.