ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్

TG: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య వాతావరణం పెరుగుతోంది. దీంతో సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ నివాసితుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా సేవలను అందిస్తోందని తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.