పోలియో రహిత సమాజ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

సూర్యాపేట: పోలియో రహిత సమాజ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ నందు పోలియో అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా 95,281 మంది ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు 591 కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు అందించనున్నట్లు తెలిపారు.