రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

KNR: సుల్తానాబాద్ మండల కేంద్రంలో బుధవారం దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనయాడుతూ, కేక్ కట్ చేసి నాయకులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.