రోజురోజుకీ రెచ్చిపోతున్న భూ ఆక్రమణలు

KDP: సిద్ధవటం మండలంలోని శేఖరాజు పల్లె గ్రామ రెవెన్యూ పరిధి ఉప్పరపల్లిలో రోజురోజుకీ భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. నకిలీ పత్రాలను సృష్టించి బినామీ పేర్లతో కబ్జా చేసి జేసీబీ యంత్రంతో ప్రభుత్వ స్థలాలను చదును చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గురువారం స్థానిక VRA పనులను నిలుపుదల చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.